ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి సంబంధించి పలు నివేదికలతో ఆయన విజయవాడ నుంచి భువనేశ్వర్ వెళ్లగా.. శుక్రవారం అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు శనివారం నాడు ఢిల్లీలో ప్రధాని మోదీతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశం కానున్నారు. అయితే ఏపీ గవర్నర్ హరించందన్ మర్యాదపూర్వకంగానే ప్రధాని మోదీని కలుస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కరోనా పరిస్థితుల కారణంగా చాలాకాలంగా ఆయన ప్రధానిని…