2023 నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేసి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆయన చేసిన కృషికి ఫలితంగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్నాడు.నేడు (డిసెంబర్ 7) రేవంత్ రెడ్డిముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, రేవంత్ అభిమాని అయిన బండ్ల గణేష్ తాను బయోపిక్ తీయబోతున్నట్లు చెప్పడం విశేషం. విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ ఎదిగిన తీరు ఓ సినిమా స్టోరీకి ఏమాత్రం తక్కువ కాదనడంలో సందేహం లేదు. అలాంటి వ్యక్తి స్టోరీని బయోపిక్ గా తీయాలని అనుకుంటున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచీ ఊపు మీదున్న బండ్ల గణేష్..నేడు రేవంత్ ప్రమాణ స్వీకారం జరగబోయే ఎల్బీ స్టేడియానికి వెళ్లనున్నాడు.
తన అభిమాన నేత సీఎంగా ప్రమాణం చేస్తుంటే చూడాలని ఎంతగానో ఆరాటపడుతున్నాడు.. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన అతడు.. తన జీవితంలో రేవంత్ ఎదుర్కొన్న సవాళ్లను హైలైట్ చేస్తూ బయోపిక్ తీయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు.నిజానికి 2018 ఎన్నికల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అలా జరగకపోతే తాను బ్లేడుతో కోసుకుంటానని అప్పట్లో గణేష్ అనడం సంచలనంగా మారింది.. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడటంతో అతన్ని దారుణంగా ట్రోల్ చేశారు.ఆయనకు బ్లేడ్ గణేష్ అనే పేరు కూడా పెట్టారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో తనను ట్రోల్ చేసిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ గణేష్ విమర్శలు గుప్పించాడు.మరోవైపు జడ్పీటీసీగా ప్రస్థానం మొదలు పెట్టి, టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆరేళ్లలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన.. కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కానున్న రెండో వ్యక్తిగా నిలిచారు.