Bimbisara - Sitharamam:శుక్రవారం విడుదలైన 'బింబిసార', 'సీతారామం' చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు ఈ రెండు సినిమాల కారణంగా కళకళలాడుతున్నాయి. దాంతో చిత్రసీమలో ఓ పండగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం నిర్మాతలు షూటింగ్స్ ను ఆపేసి, తమ సమస్యలపై వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
Kalyan Ram: శుక్రవారం విడుదలై విజయపథంలో సాగిపోతున్న 'బింబిసార' చిత్రం గురించి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేశారు. ఇంతకాలంగా తనకు దన్నుగా నిలిచి ప్రేమను అందించిన చిత్రసీమకు చెందిన స్నేహితులకు, మీడియాకు, శ్రేయోభిలాషులకు, సినీ ప్రేమికులకు, నందమూరి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 'బింబిసార'కు ఇవాళ లభించిన విజయం యావత్ సినిమా రంగానికి చెందిన విజయంగా కళ్యాణ్ రామ్ అభివర్ణించారు. ఈ సందేశంలో కళ్యాణ్ రామ్ 'బింబిసార' చిత్ర ప్రయాణం గురించి తలుచుకున్నారు.…
Bimbisara: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ హీరోగా ఇంతవరకూ ఎనిమిది చిత్రాలు నిర్మించాడు. కానీ ఏ ఒక్క సినిమానూ స్టార్ డైరెక్టర్ తో అతను నిర్మించలేదు. ఆరేళ్ళ క్రితం 'ఇజం' సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసినా అప్పుడు పూరి పరాజయాల్లో ఉన్నాడు. విశేషం ఏమంటే... ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి చిత్రం 'అతనొక్కడే' ను కొత్త దర్శకుడు సురేందర్ రెడ్డితో తీశాడు కళ్యాణ్ రామ్.