ఏపీలో ఉపాధి హామీ పథకం పనుల బిల్లుల చెల్లింపు వ్యవహారం నిత్యం హాట్ టాపిక్ అవుతూనే వుంది. నరేగా బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ నరేగా బిల్లులు చెల్లించలేదని హైకోర్ట్‌లో కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలయిన సంగతి తెలిసిందే. 300 పిటిషన్లను విచారించింది హైకోర్టు. ఈ నెల 21వ తేదీలోపు నరేగా బిల్లులను చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది హైకోర్ట్. బిల్లులు చెల్లింపులో జాప్యంపై వివరణ ఇచ్చేందుకు హైకోర్టుకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన…
ఆంధ్రుల పాలిట వరం పోలవరం విషయంలో కేంద్రం వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఇచ్చిన నిధుల్లోనూ కేంద్రం కోత పెడుతుండడం అసహనం పెంచుతోంది. విద్యుత్కేంద్రం తవ్వకం పనులకు గతంలో ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం తెలిపిందని తెలుస్తోంది. పోలవరం దగ్గర 960 మెగావాట్ల విద్యుత్కేంద్రం పనులు చురుకుగా సాగుతున్నాయి. దీని నిర్మాణానికి రూ.4,560.91 కోట్లను డీపీఆర్ నుంచి ఇప్పటికే మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రం అడగడం లేదు. విద్యుత్కేంద్రానికి…