బీహార్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రులు విరామం లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ప్రధాని మోడీ శుక్రవారం బీహార్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్ గ్రామం సమస్తిపూర్ నుంచి మోడీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తొలుత కర్పూరి ఠాకూర్‌కు మోడీ నివాళులర్పించనున్నారు.