Bihar: బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమైంది. నితీష్ కుమార్ 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బుధవారం, పాట్నాలో జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్‌ను తమ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆయన పేరును బీజేపీ నేత, ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన సామ్రాట్ చౌదరి ప్రతిపాదించారు.