బీహార్‌లో జేడీయూ బీజేపీ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నితీష్ సర్కారు నేడు బలపరీక్షను ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నితీష్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై విశ్వాసం కోరుతూ బీహార్ సీఎం నితీష్ కుమార్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత నితీష్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
బిహార్‌లో ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడుల తర్వాత ఆ రాష్ట ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. కేంద్రంలోని అధికార పక్షం తమకు ఆధిక్యత లేని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీలను పంపుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీకి ముగ్గురు అల్లుళ్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ వాకౌట్ చేయడంతో మూజువాణి ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా నెగ్గింది. విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.