వరికి మద్దతు ధర కోసం అనేక రాష్ట్రాల్లో నిరసనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. అన్నదాతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఛాలెంజ్‌తో పాటు వరి గడ్డిని కాల్చడం కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు మరో పెద్ద సవాలుగా మారింది. అలా చేయడం వల్ల వాతావరణం కలుషితం అవుతోందని చెప్పినా వినడం లేదు.