బిగ్ బాస్ సీజన్ 5 రసకందాయంలో పడింది. మూడోవారం హౌస్ లోంచి వరుసగా మూడో లేడీ కంటెస్టెంట్ గా లహరి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు హౌస్ లో కేవలం 16 మంది ఉన్నారు. అందులో నాలుగో వారానికి ఏకంగా ఎనిమిది మంది నామినేట్ కావడం విశేషం. ఇంతవరకూ ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంతమందిని నామినేట్ చేయడం ఇదే మొదటిసారి. ఆ ముగ్గురి మధ్య ఆసక్తికర చర్చ! లహరి బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు…
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ వారి వారి రంగాల్లో ఎంతో కొంత గుర్తింపు, గౌరవం ఉన్నవారే. అయితే విభిన్న నేపథ్యాన్ని, మనస్తత్వాన్ని కలిగిన వారు కావడంతో వారి ఆలోచనా విధానంలోని వైరుధ్యం కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత శనివారం నాగార్జున సిరికి ఏ విషయంలో అయితే క్లాస్ పీకాడో… అదే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది సోమవారం బిగ్ బాస్ హౌస్ లో మరోసారి చోటు చేసుకుంది. ‘వాల్ ఆఫ్ షేమ్’లో భాగంగా ఇద్దరు ఇంటి…
‘బిగ్ బాస్ 5’ ఆరంభం అయి వారం దాటింది. ఇప్పటి వరకూ తొలి నాలుగు సీజన్స్ లో విన్నర్ గా నిలిచింది మగవారే. సీజన్ వన్ లో శివబాలాజీ, సీజన్ 2లో కుశాల్ మండ, సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 4లో అభిజిత్ విన్నర్స్ గా నిలిచారు. ఫస్ట్ సీజన్ లో హరితేజ, సెకండ్ సీజన్ లో గీతామాధురి, థర్డ్ సీజన్ లో శ్రీముఖి, ఫోర్త్ సీజన్ లో అరియానా, హారిక వంటి మహిళలు విన్నర్స్…
ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుని 5వ సీజన్ లోకి అడుగు పెట్టింది ఈ షో. ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా 2వ సీజన్ కు నాని హోస్ట్ గా మారాడు. ఆ తర్వాత మూడు, నాలుగు సీజన్స్ తో పాటు ప్రస్తుతం నడుస్తున్న 5వ సీజన్ కు కూడా నాగార్జుననే…
బిగ్ బాస్ సీజన్ 5 లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ఒక చోట చేరడంతో అది ఫిష్ మార్కెట్ ను తలపిస్తోంది. నిజం చెప్పాలంటే… ఈ 19 మందిని గుర్తుపెట్టుకోవడం వ్యూవర్స్ కు అసలు సిసలు టాస్క్ గా మారిపోయింది. పైగా ఒక రోజు జరిగిన సంఘటనలన్నింటినీ కేవలం ఓ గంటకు కుదించడం వీడియో ఎడిటర్స్ కు సైతం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ ను…