BiggBoss 8 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికి తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవల సీజన్ 8 కూడా అన్ లిమిటెడ్ టర్న్‌లు, ట్విస్ట్‌లతో పూర్తయింది.
ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. అన్ లిమిటెడ్ టర్న్‌లు, ట్విస్ట్‌లు అంటూ.. సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 8లో విజేత ఎవరనే విషయం తేలిపోయింది. కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8గా నిలిచాడు. రన్నరప్‌గా గౌతమ్ అవతరించాడు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. కొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు శుభం కార్డు పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు పశ్చిమ మండల పోలీసులు తెలిపారు. దాదాపుగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
Bigg Boss Season 8: రియాల్టీ షోలలో ఎంతో పేరుగాంచిన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అనేక భాషలలో ఈ బిగ్ బాస్ షో బుల్లితెరపై బాగా ప్రాముఖ్యం చెందింది. ఈ షో పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ చూసే ఆడియన్స్ మాత్రం చూస్తూనే ఉన్నారు. ఇకపోతే భారతదేశంలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం లాంటి వివిధ భాషల్లో ఈ భాషకు మంచి రెస్పాన్స్ ఉంది. తెలుగులో ఇప్పటివరకు…