తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 పై సోషల్ మీడియాలోనూ, ఛానెల్స్ లోనూ ప్రతికూల వార్తలు జోరందుకుంటున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ షోపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు గేమ్ లో పూర్తిస్థాయిలో లీనమై పోయి, ఒకరి మీద ఒకరు దాడులు, ప్రతిదాడులూ చేసుకోవడం మొదలెట్టేశారు. ఆడ, మగ అనే తేడా లేకుండా, నియమ నిబంధనలను పాటించకుండా, అసభ్య పదజాలంతో మాటల యుద్ధాలకు…