బిగ్ బాస్ సీజన్ 5 షోలో అవకాశం పొందిన ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయంతో ఉన్నారు. గడిచిన నాలుగు వారాల్లో హౌస్ లో ఏర్పడిన అనుబంధాలను కొనసాగిస్తూనే, టాస్క్ వచ్చినప్పుడు మాత్రం ఎవరికి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. గత రెండు రోజులుగా, మరీ ముఖ్యంగా బిగ్ బాస్ రాజ్యంలో ఒక్కడే రాజు టాస్క్ సందర్భంగా రెండు జట్లుగా విడిపోయిన సభ్యులు సైతం కొంత ఆట అయ్యాక, ఇటూ అటూ మారడంతో రాజకుమారుల ఈక్వెషన్స్ దెబ్బతిన్నాయి.…