తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్&కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం (11 సెప్టెంబర్) నాడు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా..…
తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు, ఒప్పందాలను కుదుర్చుకోవడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు ఉన్నతాధికారుల బృందంతో కలిసి గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. . ఈ పర్యటనలో తెలంగాణ బృందం గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో ఉత్పాదక చర్చలు జరిపింది. తెలంగాణలో టెక్ సేవల విస్తరణ, AI సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ స్థాపన , ఈ ప్రాంతంలో శ్రామిక శక్తి…
రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతున్నాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిదిమంది చిన్నారులతో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చోహన్ ఆదిత్య (3 సంవత్సరాలు) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. చోహన్ ఆదిత్యను పరిశీలించిన…
పార్వతీపుతం మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదుకు ఆటంకం కలుగుతోంది. స్కూళ్లు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న తరగతులు జరగకా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని పాచిపెంట మండలం గరిసిగుడ్డి పంచాయతీ తాడివలస గిరిజన గ్రామంలో గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టారు. జిపిఎస్ స్కూల్ వెంటనే తెరవాలని ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని ఆదివాసి గిరిజన సంఘం సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.…
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1225 పడకల (బెడ్స్) సామర్థ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయనతో పాటు స్థానిక శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మేఘు రెడ్డి,…
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ సారి మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత మళ్ళీ అలాగే జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ…
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సంచలన నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త చెప్పింది కేంద్రం. కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన కల నెరవేరింది. కంటోన్మెంట్ ఏరియాలో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 27న ఢిల్లీలో జరిగిన సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకోవడం 28న దీనికి సంబంధించిన…
భద్రాద్రి థర్మల్ పవర్ విద్యుత్ కేంద్రంలో పిడుగుపాటుకు పడటంతో ట్రాన్స్ఫారం పేలింది. దీంతో.. ట్రిప్ అయి మొదటి యూనిట్ నిలిచిపోయింది. భద్రాద్రి పవర్ ప్లాంట్ 1 యూనిట్ పై పిడుగుపాటు ప్రమాదం పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరా తీస్తున్నారు. బీ.టీ.పీ.ఎస్ సీ.ఈ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి తుమ్మల.. పిడుగుపాటు ప్రమాద వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. జనరేషన్ ట్రాన్స్ ఫార్మర్…
జస్టిస్ నరసింహ రెడ్డి కమిషన్ కు నాకు తెలిసిన, గుర్తు ఉన్న సమాచారంను లేఖ రూపంలో పంపానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మా ప్రభుత్వం హయంలో విద్యుత్ ఒప్పందాలపై ఇతరుల లేవనెత్తిన అనుమానాలకు కూడా సరిపోయే పద్ధతిలో లేఖలో సమాధానం ఇచ్చానని, విద్యుత్ ఒప్పందాలపై కొంత మంది కుహనా మేధావులు అర్థం లేని ఆరోపణలు చేశారన్నారు జగదీష్ రెడ్డి. PGCL లైన్ ను తెలంగాణ రాష్ట్ర…