రీల్ చేస్తూ 300 అడుగుల లోయలో పడి మహిళ మృతి 23 ఏళ్ల మహిళ కారు డ్రైవింగ్ చేస్తూ 300 అడుగుల లోయలో పడి మరణించిన ఘటన మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. మృతురాలు ఛత్రపతి శంభాజీ నగర్‌లోని హనుమాన్‌నగర్‌కు చెందిన 23 ఏళ్ల శ్వేతా దీపక్ సుర్వసేగా గుర్తించారు. శ్వేత సులి భంజన్ ప్రాంతంలోని దత్ధామ్ ఆలయానికి వెళ్లినట్లు సమాచారం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఆమె రీల్ చేయడానికి ప్రయత్నించింది.…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎల్లుండి (జూన్19న) కరీంనగర్ వస్తున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజయ్ కుమర్ కు ఘన స్వాగతం పలికేందుకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ శ్రేణులు సిద్దమయ్యాయి. వాస్తవానికి ఈనెల 19న ఇద్దరూ కలిసి రాష్ట్రానికి రావాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ భావించారు. అయితే 19న సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీకి హాజరు కావాలని కొద్ది సేపటి క్రితం…
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం గొంది గ్రామ సమీపంలో గత కొన్ని రోజులుగా పులి తన పిల్లలతో సంచరించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పులి తన పిల్లలతో కలిసి అటవీ అంచు గ్రామ సమీపంలోని కాలువ ఒడ్డును తన ఆశ్రయంగా మార్చుకుని చుట్టుపక్కల తిరుగుతూ రైతులను , నివాసితులను భయాందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు. పులుల సంచారంతో పొలం పనులు చేపట్టేందుకు భయపడుతున్నామని పేర్కొన్నారు. పులులను అడవుల్లోకి మళ్లించి మనుషులు, పశువులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని…
చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్ చిన్నారిని చిదిమేసిన నిందితున్నీ వదిలేది లేదని మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి పై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందన్నారు. ఇలాంటి సంఘటనల…
Jharkhand Road Accident : జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి సోన్‌భద్రలోని వింధమ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అత్యంత నిరాడంబరంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు బండి సంజయ్ కుమార్. రేపు ఉదయం 10.35 గంటలకు నార్త్ బ్లాక్ లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బండి సంజయ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై బండి సంజయ్ కు ఆశీస్సులు అందించనున్నారు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి…
ఓ వ్యక్తి చనిపోవడంతో అతడి అంతిమయాత్రను నిర్వహించారు కుటుంబీకులు. అయితే.. ఇంటి నుంచి స్మశానం వరకు డప్పుచప్పుళ్లతో బాణసంచాలు కాల్చుతూ సదరు వ్యక్తి భౌతికకాయాన్ని తీసుకువెళ్తున్నారు బంధువులు. అయితే.. అంతిమయాత్ర ఊరేగింపు కొనసాగుతుండగా.. బాంబులు పేల్చడంతో.. అక్కడ సమీపంలో ఉన్న తేనెతెట్టుకు తగిలింది. ఇంకేముంది.. ఆ తేనెతెట్టుకున్న తేనటీగలు ఒక్కసారిగి అంతిమయాత్ర ఊరేగింపులో ఉన్న జనాలపై దాడి చేయడం ప్రారంభించారు. దీంతో.. అంతిమయాత్రలోని మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలేసి బంధువులు తలోవైపు పరుగులు తీశారు. United Kingdom: మా…
భారతీయ రైల్వే ద్వారా మాదక ద్రవ్యాల రవాణాను ఎదుర్కోవడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), సికింద్రాబాద్ డివిజన్ తన కొనసాగుతున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు, ‘ఆపరేషన్ నార్కోస్’ కింద, ఆర్‌పిఎఫ్ సిబ్బంది 37 సంఘటనలలో రూ. 2.7 కోట్ల విలువైన 1,084 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో, RPF అధికారులు డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై 36 మంది వ్యక్తులను అరెస్టు చేశారు, గత సంవత్సరం ఇదే…
కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 71 మంది మంత్రులతో ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంత్రులతో ప్రమాణం చేయించారు. మోదీ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖను అప్పగించిన కేంద్రం.. బండి సంజయ్‌కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టింది. వీరితో పాటు.. మోడీ 3.0లో అమిత్ షా హోం మంత్రిత్వ శాఖను, రాజ్‌నాథ్…
రోజురోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా . అడపిల్ల అయితే చాలు.. మృగాళ్లలా మీదపడిపోతున్నారు కొందరు. ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మ నాన్న తరువాత గురువు దైవంతో సమానం అని చెప్పే మన సమాజంలో.. అదే గురువు కాల సర్పం అయితే.. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక మైనర్‌పై అఘాయిత్యం వెలుగులోకి…