తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. తాజాగా సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతోంది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తామని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ సోమవారం నాడు ప్రకటించారు. 2025 నాటికి తొలిదశ ప్రారంభం అవుతుందని తెలిపారు. తర్వాత దశలవారీగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ పరిశ్రమల…