తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 17న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడితే.. మూడు రోజుల సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.