చిరంజీవి, కె.యస్. రామారావు కాంబినేషన్ అనగానే గతంలో వారిద్దరి కలయికలో వచ్చిన సూపర్ హిట్స్ గుర్తుకు వస్తాయి. ‘అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, స్టువార్టుపురం పోలీస్ స్టేషన్’ వంటి సినిమాలు వీరి కలయిలో రూపొందాయి. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీరి కలయికలో సినిమా రాబోతోంది. 1991లో వచ్చిన ‘స్టూవార్ట్ పురం పోలీస్ స్టేషన్’ తర్వాత వస్తున్న సినిమా ఇది. గత కొద్ది సంవత్సరాలుగా చిరంజీవితో సినిమా చేయాలని తాపత్రయపడుతున్న కె.యస్.రామారావు కోరిక నెరవేరనుంది. ఇటీవల కాలంలో…