Bhojpuri songs: భోజ్‌పురి సినిమాలు, అక్కడి పాటలు అశ్లీలతక కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ముఖ్యంగా మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే పాటలపై, సినిమాలపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా అక్కడి సిని పరిశ్రమ తీరు మార్చుకోవడం లేదు. ముఖ్యంగా మహిళ శరీరాన్ని ఉద్దేశిస్తూ ‘‘డబుల్ మీనింగ్’’గా రాసే పాటలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.