ప్రజంట్ టాలీవుడ్‌లో హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోలో శర్వానంద్ ఒకరు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న శర్యా నటుడిగానే కాదు, సినీ నిర్మాణంలోనూ పట్టు సంపాదించారు. ఆయన గతంలో కొన్ని సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు. ఆ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టి ఓంఐ పేరుతో కొత్త బ్రాండ్‌ని ప్రారంభించారు. సినీ నిర్మాణాలతోపాటు, వెల్‌నెస్, హాస్పిటాలిటీ రంగాల్లోనూ ఈ బ్రాండ్‌పై ఉత్పత్తుల్ని తీసుకు రానున్నారు. ఇక ప్రజంట్ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే.. శర్వానంద్,…