Karnataka: కర్ణాటక చిత్తాపూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ర్యాలీకి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై రాజకీయ వివాదం రాజుకుంది. శాంతిభద్రతల సమస్యను పేర్కొంటూ అధికారులు అనుమతికి నిరాకరించారు. ఆర్ఎస్ఎస్‌కు చెందిన వ్యక్తి, సంస్థ శతాబ్ది ఉత్సవాలకు, విజయదశమి ఉత్సవం కోసం పట్టణంలో చిన్న స్థాయి ఊరేగింపు నిర్వహించడానికి అనుమతి కోరారు. దీనికి పోలీసుల నుంచి నిరాకరణ ఎదురైంది. ఆదివారం ఆర్ఎస్ఎస్ మార్చ్‌కు అనుమతి కోరిన అదే మార్గంలో భీమ్ ఆర్మీ,భారతీయ దళిత్ పాంథర్ (R)…
Chandra Shekhar Aazad : భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌పై దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌లో జరిగింది.
మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ విషయంలో బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులపై దళిత సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. 1994లో దళిత ఐఏఎస్ అధికారి అయిన గోపాల్‌గంజ్ జిల్లా మాజీ మేజిస్ట్రేట్ జి కృష్ణయ్యను హత్య చేసిన కేసులో దోషిగా ఉన్న ఆనంద్ మోహన్ మంగళవారం జైలు నుంచి విడుదలైయ్యారు.