సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'సార్' చిత్రం 25 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా సాగుతోంది. ఈ సినిమా విజయంతో ఫిబ్రవరి నెల ఈ సంస్థకు అచ్చివచ్చినట్టు అనిపిస్తోంది.
ఆ డైరెక్టర్ చేసింది రెండు సినిమాలు. రెండూ హిట్స్. దీంతో తంతే బూరెల బుట్టలో పడ్డట్టు మెగా ఛాన్స్ పట్టేశాడు. ఆ దర్శకుడే వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తొలి చిత్రంగా ‘ఛలో’ తీసి సక్సెస్ కొట్టిన వెంకీ ఆ తర్వాత నితిన్ తో ‘భీష్మ’ రూపొందించి మరో హిట్ కొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే మెగాఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా ‘అఖండ’లో నటిస్తున్నారు. ‘సింహా, లెజెండ్’ తర్వాత రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల బాలకృష్ణ తన తదుపరి చిత్రాలపైనా క్లారిటీ ఇచ్చారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘క్రాక్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన మలినేని గోపీచంద్ తో బాలకృష్ణ మూవీ చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా వార్త వచ్చింది.…