మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా సినిమా రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు. గేమ్ చేంజర్ టీమ్ వాయిదా వేసుకోమని కోరడంతో సినిమా వాయిదా వేసినట్టు అప్పట్లో ప్రకటించారు.