విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే తెరిపించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతు మహాజన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామన్నారు. భీమసింగిలో ఉత్పత్తి చేసిన చక్కెరను వివిధ హిందూ దేవాలయాల్లో ప్రసాదానికి వాడేందుకు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ విధంగా…