Bhatti Vikramarka: రాష్ట ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం త్వరలో విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ..
Bhatti Vikramarka: తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకు పోరాడిన భట్టి విక్రమార్క ఎట్టకేలకు డిప్యూటీ సీఎంతో సెటిల్ అయ్యారు. అయితే ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రతిపాదనకు ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఎట్టకేలకు భట్టికి ఆ పదవి దక్కనుంది.
Telangana CM Post: సీఎం ఎవరనేదానిపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు నేడు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీలో చర్చించనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాల్లో పార్టీ గెలిచిన వెంటనే జరగాల్సిన సీఎం ఎంపిక వాయిదా పడింది. ముఖ్యమంత్రి పదవి ఎవరికివ్వాలనే గొడవ ఈజీగా తేలేలా కనిపించడం లేదు..
Congress Meeting: కాంగ్రెస్ ఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే నేతృత్వంలో సీఎల్పీ సమావేశం జరిగింది.
మధిరలో మల్లు భట్టి విక్రమార్క గెలుపొందారు. 35 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో సీఎల్పీ నేత మరోసారి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై 35,190 ఓట్ల తేడాతో విక్టరీ సాధించారు.
తెలంగాణ ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్ అధికారంలో వస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అష్టలక్ష్మి దేవాలయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మధిర నియోజకవర్గ ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ తిరువూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయంలో హోమం కార్యక్రమం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారం సీఎల్పీ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి భట్టి విక్రమార్క్ మరో ముందడుగు వేశారు. సోమవారం ఖమ్మంలో ప్రచారం చేపట్టిన భట్టి ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. ఈ ప్రచారంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చొప్పికట్లపాలెంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రమాణం చేశారు. అవినీతి రహితంగా వ్యవహరిస్తానని ఆంజనేయస్వామి ఎదుట ప్రమాణం చేశారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. ‘రైతుబంధు ఆపింది కాంగ్రెసేనంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘రైతులను కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలే మోసం…
ప్రచారానికి రేపు ఒక్కరోజు సమయం ఉండటంతో రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. అందులో భాగంగా.. ఖమ్మం జిల్లా ముష్టికుంట్లలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు తెలంగాణ పేదలకు కేసీఆర్ చేసిందేమీ లేదని ఆరోపించారు. ఏం చేయలేని కేసీఆర్ ఎక్కడుంటే ఏం లాభమని ప్రశ్నించారు?.