Home
Bhatti Vikramarka
Bhatti Vikramarka News
-
Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
తెలంగాణను పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన , అనుకూలమైన గమ్యస్థానంగా మలచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’ సదస్సులో ఆయన పాల్గొని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులు ముందుకు వస్తే ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. పెట్టుబడులకు… -
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తబోయే వాతావరణ మార్పులు, వర్షపాత లోటు , వ్యవసాయ రంగంపై పడబోయే సంభావ్య ప్రభావాలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు సచివాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల ద్వారా రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సంబంధిత మంత్రులు, వ్యవసాయ శాఖ… -
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
తెలంగాణలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, ప్రోత్సాహకాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారని గుర్తుచేశారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్, ఎన్డీటీవీ, ఏఎం గ్రీన్, ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) సంయుక్త ఆధ్వర్యంలో… -
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు కేంద్రాన్ని కోరారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించడంతో పాటు, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడే వారిపై జీరో టాలరెన్స్ విధానం కొనసాగాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలుకు పునాది పరస్పర విశ్వాసమేనని భట్టి పేర్కొన్నారు. ఉమ్మడి జాతీయ… -
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
Bhatti Vikramarka: ఎల్‌నినో వల్ల దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని.. విద్యుత్‌కి సంబంధించి రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా 19,892 మెగావాట్ల డిమాండ్ ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కర్ణాటక పెద్ద రాష్ట్రం, వాళ్ళ డిమాండ్ 20 వేల మెగావాట్ల.. కానీ మన రాష్ట్రంలో విద్యుత్ పీక్‌కి డిమాండ్ పెరిగిందన్నారు. అయినా.. ఎలాంటి ఇబ్బంది కట్స్ లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్తు వినియోగంపై తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇబ్బందుల్లో… -
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
సూర్యాపేట జిల్లాలోని పులిచింతల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని, ఇప్పటివరకు జరిగిన విద్యుత్ ఉత్పత్తి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూనిట్ కంట్రోల్ రూమ్‌ను స్వయంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం, ప్రాజెక్టు నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి తీరుపై అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. 20 వేల మెగావాట్లకు… -
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడంపై సమీక్షించిన సీఎం, డిప్యూటీ సీఎంలు అధికారులను తీవ్రంగా ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు, బొగ్గు లభ్యత , ప్లాంట్ నిర్మాణంలోని లోపాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. జీ-9… -
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్’ ఆర్థిక సదస్సు ఘనంగా నిర్వహించబడింది. 2047 నాటికి భారతదేశం సాధించాల్సిన సమగ్ర ఆర్థిక వృద్ధి, ఆ దిశగా వివిధ రాష్ట్రాలు పోషించాల్సిన పాత్ర , అనుసరించాల్సిన ప్రణాళికలపై ఈ సమీక్షా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై, రాష్ట్ర ప్రభుత్వ విజన్ , ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా వివరించారు. 2047 నాటికి… -
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
పసిఫిక్ మహాసముద్రంలో సముద్రజలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుందని, తెలంగాణలోనూ వర్షపాతం లోటు, జలాశయాల్లోకి తగ్గిన నీటి ప్రవాహం, వ్యవసాయంపై ఒత్తిడి, విద్యుత్ డిమాండ్ పెరుగుదల వంటి పరిణామాలు కనిపించాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అయితే సమస్య తీవ్రతను ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం ఏప్రిల్ నుంచే వివిధ శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టిందని ఆయన అసెంబ్లీలో వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు… -
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, అసలు ఈ ప్రాజెక్టును కడదామా? వద్దా? అనే దానిపై బీజేపీ సభ్యులు తమ స్పష్టమైన వైఖరిని చెప్పాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. శాసనసభలో ఎల్లీ నో ప్రభావం తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యల గురించి జరుగుతున్న చర్చలో భాగంగా బీజేపీ సభ్యులు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గురించి అంశం లేవనెత్తడంతో…
తాజావార్తలు
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!