CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేటితో ముగిసింది. తన నివాసం నుంచి విమానాశ్రయానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయల్దేరారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు నీళ్ళు లేవు, నియామకాలు లేవన్నారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క్. సింగరేణి అంటేనే కొత్తగూడెంకు ఒక ఆణిముత్యం.. కానీ ఇప్పుడు సింగరేణిని ఈ పాలకులు ఏలా తయారు చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు భట్టి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న సీపీఐ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు మద్దుతుగా కొత్తగూడెంలో పర్యటించారు. అక్కడ రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌కు సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శి…
T Congress: కాంగ్రెస్ పార్టీకి ఫేక్ జాబితాతో పార్టీ శ్రేణులకు భయం పట్టుకుంది. 14 మందితో జాబితా విడుదల అంటూ పోస్టులు వైరల్ కావడంతో శ్రేణుల్లో గుబులు నెలకొంది. ఆరు పేర్లతో మరో జాబితా అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
తెలంగాణ జన గర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జన గర్జన సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలనే సంకల్పంతో ప్రభుత్వ అడ్డంకులు తొలగించి మరీ సభకు వచ్చానన్నారు.
అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న తెలంగాణ పీసీసీకి కొత్త దిశానిర్దేశం చేయాలని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలంగాణ నూతన ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే ను ఎయిర్ పోర్ట్ లోని లాంజ్ లో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్ ఆహ్వానించారు.