Bhatti vikramarka React On Gulamnabhi Azad Resign
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. పార్టీ నుంచి సీనియర్ నేతలు వదిలివెళ్తుండటం ఆ పార్టీకి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గులాంనబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా.. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారిదంటూ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశం విపత్కర పరిస్థితుల్లో అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. రాజ్యాంగ మూల సూత్రలు లౌకిక వాదం లాంటి అంశాన్ని నిలబెట్టి ముందుకు తీసుకెళ్లాలన్నారు. అనేక విలువలతో కూడిన దేశ ప్రజాస్వామ్య మూలలను బలోపేతం చేయడమే కాకుండా కుల మతాలకు అతీతంగా జాతి నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ లాంటి విచ్ఛిన్నకర శక్తులు దేశంలో చిచ్చుపెడుతున్న సమయంలో ఆజాద్ లాంటి అత్యంత అనుభవం గల కాంగ్రెస్ నాయకులు పార్టీ కి రాజీనామా చేయడం బాధకు గురి చేస్తుందని, ఇటువంటి సమయంలో కాంగ్రెస్ అది నాయకులు గాంధీ నెహ్రు కుటుంబాలకు ఉండి దేశ విచ్ఛిన్నకర శక్తులపై పోరాటం చేయాల్సిన సమయంలో ఆజాద్ ఇలా రాజీనామా లు చేయడం అత్యంత బాధాకరమన్నారు. సోనియా గాంధీ గారు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా దేశం కోసం పార్టీ మూల సిద్దాంతంతో పని చేస్తున్న వీర వనిత, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు తన శక్తినంతా ధరపోసి దేశం కోసం, రాజ్యాంగ మూల సూత్రాలకు కాపాడుతూ పని చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ లో సుదీర్ఘ కాలం పని చేసి అనేక ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించిన ఆజాద్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం క్షోభకు గురి చేస్తుందన్నారు. ఆజాద్ రాజీనామా సందర్భంగా ఆయన పార్టీ పైన, రాహుల్ గాంధీ పైన లేవనెత్తిన అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.