(జూలై 17న భారతీరాజా పుట్టినరోజు) కథలో ఓ సమస్య, దానికి తగ్గ పరిష్కారం, నాయికానాయకులు కలుసుకోవడం లేదా విడిపోవడం – ఇదే అంతకు ముందు మన సినిమాల్లోని ఫార్ములా. అయితే నాయికానాయకులు కలుసుకుంటారా, లేదా అన్న అంశాన్ని ప్రేక్షకుల ఊహకే వదిలేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలా సినిమా తీయాలనుకున్నారు భారతీరాజా. ఆయన చెప్పిన కథ విని కొందరు నొసలు చిట్లించారు. కొందరి ముక్కుపుటాలు అదిరాయి. మరికొందరు వెకిలిగా నవ్వారు. అయినా, అతని కథలో వైవిధ్యం…