Story Board: తెలంగాణలో ఎన్నికలకు గట్టిగా 50 రోజుల సమయం కూడా లేదు. దీంతో అన్ని పార్టీల్లోనూ రాజకీయ వేడి పెరుగుతోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుండగా.. కేసీఆర్ కూడా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో రిలీజ్ చేసి.. ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు చూస్తుంటే.. ప్రజల్ని ఆకర్షించటానికి హారాహోరీగా పథకాల రూపకల్పన చేసినట్టు కనిపిస్తోంది. ఈసారి తెలంగాణ ఎన్నికలు సంక్షేమం చుట్టూనే తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం…