Hyderabad: అంబర్‌పేట్ ఎస్సై తుపాకీ మిస్టరీ వీడింది. తుపాకీ ఆచూకీ లభ్యమైంది.. ఇటీవల.. పోటీ పరీక్షల కోసం ఎస్సై భాను ప్రకాష్ విజయవాడకు వెళ్లాడు.. అక్కడ ఒక లాడ్జిలో వారం రోజులు పాటు బసచేశాడు. తనతో పాటు తుపాకీని తీసుకొని వెళ్లాడు. పోటీ పరీక్షలు రాసిన తర్వాత తుపాకీతో ఉన్న బ్యాగు కనిపించకుండా పోవడంతో హైరానా పడ్డాడు. లాడ్జీ సిబ్బందిని నిలదీసినప్పటికీ ప్రయోజనం శూన్యమైంది.. విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చి హైదరాబాద్‌కి చేరుకున్నాడు.