యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్, శ్రీవిష్ణు నటించిన ‘భళా తందనాన’ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని ఈరోజు లాంచ్ చేశారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్‌లో శ్రీవిష్ణును మునుపెన్నడూ చూడని అవతార్‌ని చూపించారు. ఇందులో శ్రీవిష్ణు క్రైమ్ రిపోర్టర్‌గా నటించాడు. అమాయకమైన, భిన్నమైన కోణంలో ఆలోచించే వ్యక్తిగా కనిపించనున్నాడు. క్యాథరిన్ ట్రెస్సా కూడా రిపోర్టర్‌గా కనిపిస్తుంది. Read…