ఏటూ చూసిన శివనామస్మరణ.. అడుగడుగునా పంచాక్షరి పలుకులు.. అహా ఇది కైలాసమా అనట్టు ఉండే వేదిక.. ఆ వేదికను అలంకరించిన దైవ స్వరూపులైన పెద్దలు.. ఏమి చెప్పమంటారు కోటి దీపోత్సవ కళాశోభ.. ఇక బంగారు లింగోద్భవ ఘట్టం గురించి చెప్పాలంటే.. మాటలు రావడం లేదు.. కోటి దీపోత్సవ ప్రాంగణంలో అడుగుపెట్టిన మొదలు బయటికి వచ్చే వరకు కార్తీకమాసంలో కైలాసం దర్శనం జరుగుతోందనే భావన తప్ప మరేది మదిలోకి రాదు అనడం అతిశయోక్తి లేదు. మంగళవాయిద్యాలు నడుమ స్వామి…
సాహిత్యంలో దైవత్వాన్ని పొందిన తొలి ధార్మిక గ్రంథం భగవద్గీత.. మహాభారతంలోని భాగమైనా ఉపనిషత్తు స్థాయిని పొందిన కావ్య ఖండం. భారతీయ సంస్కృతి, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞాన ప్రవాహం. భీష్మపర్వంలోని 25 వ అధ్యాయం నుంచి 42 వ అధ్యాయం వరకు ఉన్న 700 శ్లోకాలకు భగవద్గీత అని పేరు.. అయితే, తొలిసారి భక్తి టీవీ 700 శ్లోకాల సంపూర్ణ పారాయణ యజ్ఞం చేస్తోంది… భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్‌వీ గంగాధర శాస్త్రి గారి ఆధ్వర్యంలో..…