భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్.. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి హారతి…
భక్తి టీవీ ఆధ్వర్యంలో అంగరం వైభవంగా నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలో ఈరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. కాగా.. ఈ రోజు కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. దీపాల పండగలో ఇప్పటికే మూడు రోజులు పూర్తి కాగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నేడు కోటి దీపోత్సవంలో నాలగవ రోజు.
ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మొదటిరోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
కార్తిక మాసం వచ్చిందంటే చాలు అందరి దృష్టి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంవైపే వెళ్తుంది. ఎందుకంటే ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవమే కారణం. వేలసంఖ్యలో భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగిస్తారు.. ఇక, కుదరని వాళ్లు ఎన్టీవీ, భక్తి టీవీల్లో లైవ్‌లో వీక్షిస్తుంటారు.. ఈ ఏడాది కోటి దీపోత్సవం ఈ రోజే ప్రారంభమైంది. కోటిదీపోత్సవం-2024 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది.
2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై.. పుష్కరకాలంగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ ఏడాది సైతం రండి.. తరలిరండి అంటూ మరోమారు ఆహ్వానం పలుకుతోంది.
మణికొండలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం హైదరాబాద్‌లోని అతి పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం మణికొండ ప్రాంతంలోని మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో ఉంది. ఇది 500 సంవత్సరాల పురాతన ఆలయం, ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూ వెలసి పూజలందుకుంటున్నారు. హనుమంతులవారితో పాటు శ్రీ వీరభద్ర స్వామి, భోళా శంకరుడు కూడా స్వయంభూ దేవతలుగా పూజించబడుతున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రామలవారి ఆలయం కూడా ఉంది. పండుగలు, ముఖ్యమైన కార్యక్రమాలను జరుపుకునేందుకు ఓ విస్తృతమైన…
కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది.. ఈ ఏడాది కూడా ఘనంగా కోటిదీపోత్సవ యజ్ఞాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది భక్తి టీవీ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 9 నుంచి 25 వరకు కోటిదీపోత్సవ మహాయజ్ఞం జరగనుంది.