తెలంగాణ ప్రభుత్వం హిందూ పండగలపై ఆంక్షలు విధిస్తుందని.. కేసీఆర్ సర్కార్‌కి బతుకమ్మపై ఉన్న శ్రద్ధ వినాయక చవితి ఉత్సవాలపై ఎందుకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు.. దీక్షకు దిగిన విషయం తెలిసిందే.. హిందూ పండగలపై ఆంక్షలు విధించాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన ఆయన.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. అయితే, బేగంబజార్‌లోని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం…