జార్జిరెడ్డి, పలాస వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించి.. మసూద, పరేషాన్ చిత్రాలతో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. అయితే, ఆయన నటించిన ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి కారణం సరైన ప్రమోషన్లు లేకపోవడమేనని తిరువీర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కొత్త చిత్రం ‘భగవంతుడు’ టీజర్ లాంచ్ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలిచ్చారు.…