బెట్టింగ్ అంటే క్రికెట్‌కే పరిమితం అనుకుంటాం. కాని ఎన్నికలప్పుడు కూడా భారీ బెట్టింగ్‌లు జరుగుతాయి. బెంగాళ్ అసెంబ్లీ ఎన్నికలా..హుజూరాబాద్ ఉప ఎన్నికలా అన్నది కాదు. టఫ్ ఫైట్ ఉంటే చాలు ఇలా అక్రమంగా వందల కోట్లు చేతులు మారుతాయి. పందెం రాయుళ్లకు ప్రాంతంతో సంబంధం లేదు. హోరా హోరి ఉందా.. లేదా, అన్నదే ముఖ్యం. ఇప్పుడు హుజురాబాద్ బై ఎలక్షన్ తెలంగాణే కాదు యావత్ దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది. అత్యంత ఖరీదైన ఎన్నికగా పరిశీలకులు…
హుజురాబాద్ ఉపఎన్నికపై బెట్టింగ్ కోట్లల్లో నడుస్తోంది. ఏ పార్టీ గెలుస్తుంది..ఎన్ని ఓట్ల తేడాలో గెలుస్తుంది..ఏఏ ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు వస్తాయని పెద్దఎత్తున పందాలు కాస్తున్నారు. బెట్టింగ్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో రహస్యంగా కొనసాగుతోంది. ఆఫ్‌లైన్‌లో సైతం బెట్టింగులు సాగుతున్నాయ్. హుజురాబాద్ ఉపఎన్నిక గెలుపు ఓటములపై కోట్లలో బెట్టింగులు సాగుతున్నాయి. తెలంగాణకు చెందిన వారితో పాటు వివిధ రాష్ట్రాల వారు సైతం బైపోల్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ ముగియడంతో పందెంరాయుళ్లు ఉపఎన్నికపై బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గత నెల నుంచే బెట్టింగ్…
టీ-20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. మరోవైపు… ఈ మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. విశాఖలో ఓ బెట్టింగ్ నిర్వాహకుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు ఉప్పందింది. దీంతో రైడ్ చేసిన పోలీసులు … బెట్టింగ్ నిర్వాహకుడు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని ల్యాప్‌టాప్, రెండు మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు చెక్‌బుక్స్, ఎటిఎం కార్డులతో పాటు 88 వేల రూపాయల నగదు…
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. బెట్టింగ్ రాజాలు కూడా అదే పంథాను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు కోళ్లపై, గుర్రాలపై పందేలు కాసేవాళ్లు. ఆ తర్వాత రాజకీయాలు, క్రికెట్ వంటి క్రేజీ అంశాలపై బెట్టింగులు నిర్వహిస్తూ పందెంరాయుళ్లు కోట్లలో సంపాదించడం మొదలుపెట్టారు. అయితే ట్రెండ్ మారుతున్న కొద్ది బెట్టింగ్ రాజాలు సైతం అప్ డేట్ అవుతున్నారు. మీడియాలో ఏ అంశంపై ప్రజలు విపరీతంగా చర్చిస్తూ ఉంటారో అలాంటి అంశాలనే పందెంరాయుళ్లు దృష్టిసారిస్తున్నారు. వాటిపైనే లక్షల్లో పందేలు కాస్తూ జేబులు…
పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ కోసం ఇండియాలో బెట్టింగ్ వేస్తున్నారు. అయితే హైదరాబాద్ బాచుపల్లిలో ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. పాకిస్థాన్ లీగ్ కోసం ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తుంది. మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసిన మదాపూర్ పోలీసులు వీరి వద్ద నుండి 21 లక్షల రూపాయలు అలాగే 33 ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటన పై మాట్లాడిన సీపీ సజ్జనార్… చాలా మంది యూత్ ఈ బెట్టింగ్స్ లో…