Telangana Assembly Elections 2023: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి రేపుతున్నాయి.. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది.. అత్యంత ఉత్కంఠగా మారిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ సంస్థలు ఒక పార్టీకే జైకొట్టినా, మరికొన్ని మాత్రం అధికార పార్టీకే వీర తిలకం దిద్దాయి. ఇంకొన్ని హంగ్ తప్పదని ఢంకా బజాయిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం కొంచెం ఇష్టం. కొంచె…
Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.. మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారానికి తెరపడింది.. ఇప్పుడు ప్రలోభాల పర్వం జోరుగా సాగుతున్నట్టు కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతోంది.. గురువారం రోజు పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఎన్నికల ఫలితాలపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయట.. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కోట్ల రూపాయలు పందెం…
Karnataka Election: కర్ణాటక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది.. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కర్ణాటక ఎన్నికలపై ఆది నుంచి తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ సాగుతోంది.. ఇక, పోలింగ్ ముగిసిన తర్వాత.. కర్ణాటకలో గెలుపెవరిది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటూ బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. పోలింగ్ ముందు వరకు ఒక అంచనాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు.. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ చూసి కొత్త ఎత్తులు వేస్తున్నారు.…
Karnataka Election: కర్నాటక ఎన్నికల్లో గెలుపోటములపై తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్ లు జరుగుతున్నాయి. విషయం ఏదైనా సరే పందెం కట్టడం అలవాటైన తెలుగు పందెం రాయుళ్లు.. కర్నాటక ఎన్నికలనూ వదలడం లేదు. ప్రచారం ప్రారంభం కాక ముందు నుంచే మొదలైన పందేలు.. ఇప్పుడు పీక్స్ కు చేరాయి. పోటాపోటీ ప్రచారం సాగడంతో పందెం రాయుళ్లు వ్యూహాలు మార్చుకుంటున్నారు. గత నెలలో కాంగ్రెస్ కు వంద నుంచి 103 సీట్లు వస్తాయని మొదలైన పందేలు ఇవాళ్టికి…
అనకాపల్లి జిల్లాలోని దిబ్బలపాలెం గ్రామానికి చెందిన పెంటకోట మధుకుమార్ ( 20 ) అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగ్ లు కట్టే అలవాటున్న మధుకుమార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పందేల కోసం అదే గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలంటూ అతడి నుంచి ఒత్తిడి పెరిగింది. అయితే, తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఈ నెల 23న రాత్రి ఎలుకల మందు…
ఇంగ్లండ్ టెస్టు టీమ్ హెడ్ కోచ్.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ఒక బెట్టింగ్ కంపెనీ 22బెట్ ఇండియాకు అతను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బెట్టింగ్ చేయమంటూ అభిమానులను ప్రోత్సహిస్తూ అతను ఇచ్చిన ప్రకటననలు ఇటీవల వెల్లువెత్తాయి.
ఇప్పుడు మునుగోడు బై పోల్ పై దృష్టి పెట్టారు బెట్టింగ్ రాయుళ్లు.. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుందని.. ఓ రెండు పార్టీల మధ్యే గట్టి పోటీ జరుగుతుందని.. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే బయటపడే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.. దీనిని క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిన బెట్టింగ్ రాయుళ్లు.. మునుగోడులో గెలుపెవరిది? అంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు..
ఈరోజు ఉప్పల్ వేదికగా జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ యాప్‌లో బెట్టింగ్‌లను ముఠా నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇండియా గెలుస్తుందని భారీ స్థాయిలో బెట్టింగ్‌లు పెడుతున్నారని.. ఆసీస్ గెలుస్తుందని రూ.వెయ్యికి రూ.4వేలు బెట్టింగ్ నడుస్తోందని.. ఇండియా టాస్ గెలుస్తుందని బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అటు బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్న 12 మందిని ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతిలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు రెచ్చిపోయారు. బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో రంగంలోకి దిగారు తిరుపతి పోలీసులు. మూడు సెల్ ఫోన్లు, 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గ్రూప్ థియేటర్ ఎదురుగా ఉన్న ఓ కూల్ డ్రింక్ షాప్ వద్ద ఘటన జరిగింది. ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య జరిగిన టి 20-20 క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసుల దాడిలో అరెస్టయిన వారిని కోనేటి వీధికి చెందిన షేక్ ఆఫ్రిద్, వైకుంఠపురంకి చెందిన…