తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేశారు. యాంకర్ శ్యామల పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదయింది. ‘Andhra365’ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు శ్యామల ప్రమోషన్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)…