Christmas: ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. కానీ ఏసు క్రీస్తు పుట్టిన బెత్లెహమ్‌లో మాత్రం ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. సాధారణంగా ప్రతీ ఏడాది క్రిస్మస్ పండగ రోజు బెత్లెహమ్ క్రీస్తు ఆరాధకులతో ఎంతో రద్దీగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం అక్కడి నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. హోటళ్లు, రెస్టారెంట్లు వ్యాపారం అంతా నిలిచింది.