ఇజ్రాయెల్‌కు రక్షణగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని ప్రధాని నెతన్యాహుకు తెలిపాను అని ఆయన చెప్పుకొచ్చారు.
Middle East tensions: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విదేశీ మంత్రిత్వ శాఖ భారతీయులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Benjamin Netanyahu: గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మంది చంపేసింది. మరో 240 మందిని కిడ్నాప్ చేసి గాజా స్ట్రిప్ ప్రాంతంలోకి తీసుకెళ్లింది.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య వచ్చే సోమవారానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు.
Israel: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగాలైన వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లపై తీవ్రంగా దాడులు చేస్తోంది. హమాస్-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇప్పటికే 28,700 మందికి పైగా మరణించారు. మరోవైపు యుద్ధం నిలిపేయాలని ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నటప్పటికీ.. హమాస్‌ని పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ పలుమార్లు స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్-హమాస్‌ల (israel hamas) మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న యుద్ధంతో రక్తపుటేరులు పారుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు.
శాశ్వత కాల్పుల విరమణ కోసం హమాస్ కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తున్న సమయంలో గాజాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్‌లో అత్యంత భీకర పోరు కొనసాగుతోంది.