Sleeping in Office: ఆఫీసులో పనిచేయకుండా నిద్రపోతే ఉద్యోగం ఊడటం ఖాయం. కంపెనీ ఏదైనా అది ఫాలో అయ్యే పాలసీ మాత్రం ఇదే. కానీ.. బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ అందరి కన్నా భిన్నంగా ఆలోచించింది. నిద్రపోయేందుకు ప్రత్యేకంగా ఒక అర్ధ గంట సమయాన్ని కేటాయించింది. పని వేళల్లో అలసటగా అనిపించినప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకునేందుకు అనుమతిస్తోంది. ఈ మేరకు ‘రైట్ టు న్యాప్’ అనే పాలసీని తెర మీదికి తీసుకొచ్చింది.