కర్ణాటకలో గతేడాది రేణుకాస్వామి హత్య కేసు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలు పవిత్ర గౌడ్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపించి.. నిత్యం వేధిస్తుండడంతో నటుడు దర్శన్ రంగ ప్రవేశం చేసి.. అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హింసించి చంపేశాడు. ఇది కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా యావత్తు దేశాన్ని కుదిపేసింది.