సోషల్ మీడియా ప్రభావమో.. పరాయి వ్యక్తులపై మోజో తెలియట్లేదు కానీ.. అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. కుటుంబాలను రోడ్డునపడేసుకుంటున్నారు. అప్పటికే పెళ్లై పిల్లలున్న మహిళలు, పురుషులు ఇతర వ్యక్తులతో కొత్త సంబంధాలను ఏర్పర్చుకుని ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. 33 ఏళ్ల వివాహిత 25 ఏళ్ల యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. చివరకు అతిడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఓయో హోటల్ రూమ్‌లో తన ప్రేయసిని ప్రియుడు దారుణంగా హత్య చేశాడు.…