Techie Suicide: నగర పాలక సంస్థ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూర్‌లో జరిగింది. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించాడు. కొత్త ఇంటి నిర్మాణానికి పదే పదే ఆటంకాలు కలిగించడం, డబ్బులు వసూలు చేసేందుకు ఒత్తిడి చేయడంతోనే బాధితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబం ఆరోపిస్తోంది.