West Bengal: పశ్చిమ బెంగాల్ మేదినీపూర్‌లో 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య అందరితో కన్నీరు పెట్టిస్తోంది. చిప్స్ దొంగిలించాడనే ఆరోపణలపై బహిరంగంగా అవమానించబడటంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మరణించడానికి ముందు, తన ఇంట్లో తన తల్లికి ఒక సూసైడ్ నోట్ రాశాడు. ‘‘అమ్మా, నేను చిప్స్ దొంగిలించలేదు’’ అని అందులో పేర్కొన్నాడు. ఇది చూస్తే, ఎంతలా ఆ పసి హృదయం బాధించబడిందో అర్థమవుతోంది. ఈ సంఘటన గురువారం సాయంత్రం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో జరిగిందని పోలీసులు తెలిపారు.