టాలీవుడ్ నిర్మాతలు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి పాన్ ఇండియా మూవీలు ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్ ఉన్న నేపథ్యంలో భీమ్లానాయక్ సినిమా విడుదల పోస్ట్‌పోన్ తో పాటు మరికొన్ని సినిమాల వివరాలను ఈ సందర్భంగా వివరించనున్నారు. ఈ ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం కోసం కింద ఇచ్చిన లింక్‌లో చూడండి.
ఈ ఏడాది సంక్రాంతికి చిత్ర పరిశ్రమలో గట్టి పోటీ నెలకొంది. స్టార్ హీరోలందరూ తగ్గేదే లే అన్నట్టుగా సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే రిలీజ్ డేట్స్ తో సహా ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా మూవీస్ ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’, ‘రాధే శ్యామ్’ సంక్రాంతి బరిలో నిలుస్తునట్లు తెలిపారు. అయితే వీరందరికన్నా ముందే ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరిలో దిగింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి…