తమిళులకు ప్రాంతీయాభిమానం, భాషాభిమానం ఎక్కువ. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఆ మధ్య కాలంలో తమిళ చిత్రాల పేర్లు ఆ భాషలోనే ఉండేవి. ఆ సినిమాలను ఇటు తెలుగు, అటు హిందీలో అనువదించినప్పుడు ఇంగ్లీష్ పేర్లు పెట్టినా, తమిళంలో మాత్రం వారి భాషలోనే టైటిల్స్ పెట్టే వారు. దానికి ఉదాహరణగా రజనీకాంత్ ‘ఎంథిరన్’ మూవీనే. ఈ సినిమాకు తెలుగులో ‘రోబో’ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు. కానీ తమిళనాట మాత్రం భాషాభిమానం చూపారు. ఇలా కొన్నేళ్ల పాటు…