భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026కు తమ జట్టును పంపడంపై భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి జట్టును పంపడం తమకు సురక్షితంగా అనిపించడం లేదని సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇదే విషయాన్ని బీసీబీ అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ ద్వారా తెలియజేసినట్టు వెల్లడించారు. ఐపీఎల్ 2026లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఆడకూడని బీసీసీఐ ఆదేశాలు జారీ…