భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2025-26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్, అంతర్జాతీయ ప్రదర్శనలను ఆధారంగా చేసుకుని గ్రేడ్‌లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈసారి గ్రేడ్‌లలో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్లు, యువ ఆటగాళ్లకు బీసీసీఐ సమానంగా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. గ్రేడ్ Aలో నలుగురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారని సమాచారం. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు…