2024-2025 సంవత్సరానికి ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల జాబితాను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. మొత్తం 34 మంది క్రికెటర్లను నాలుగు కేటగిరీల్లో బీసీసీఐ ఎంపిక చేసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోని A+ గ్రేడ్‌లో నలుగురు ప్లేయర్స్ ఉన్నారు. గత ఏడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్ట్ కోల్పోయిన స్టార్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు మళ్లీ చోటు దక్కింది. మరోవైపు ఇటీవల అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి బీసీసీఐ కాంట్రాక్టులో ఛాన్స్…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించిన జాబితా త్వరలో విడుదల కావాల్సి ఉంది. గత సంవత్సరం బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈసారి పక్కాగా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత బ్యాటింగ్‌తో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించడమే ఇందుకు కారణం. సెలక్షన్ కమిటీ, ప్రధాన కోచ్‌తో సంప్రదింపుల తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా కాంట్రాక్టు…